Murder:విజయవాడలో దారుణం.. కొడుకుని నరికి చంపిన కన్నతల్లి
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కుమారుడిని కన్నతల్లి గొడ్డలితో నరికి చంపిన ఘటన వెలుగుచూసింది.
- By Hashtag U Published Date - 10:25 AM, Wed - 13 April 22
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కుమారుడిని కన్నతల్లి గొడ్డలితో నరికి చంపిన ఘటన వెలుగుచూసింది. విజయవాడకు చెందిన అప్పల చిట్టెమ్మ (55) అనే మహిళ సోమవారం సాయంత్రం తన కుమారుడిని గొడ్డలితో నరికి చంపింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఆమెపై, మనవళ్లపై దాడికి పాల్పడ్డాడనే కారణంతోనే చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుడు అప్పాల బాల కోటయ్య (35) లారీ డ్రైవర్.
కోటయ్యకు ఆరేళ్ల క్రితం కంచికచెర్లకు చెందిన శిరీషతో పెళ్లయిందని, ఇటీవలే విడాకులు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రామనవమి వేడుకలు జరుపుకోవడానికి చిట్టెమ్మ తన కొడుకు కోటయ్య పిల్లలను ఇంటకి పిలించింది. కోటయ్య సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో మద్యం మత్తులో చిట్టెమ్మ ఇంటికి వచ్చి ఆమెతో పాటు ఇద్దరు పిల్లలపై కొడవలితో దాడి చేశాడు. చిట్టెమ్మ పిల్లలను రక్షించి ఇరుగుపొరుగు ఇంటికి తీసుకెళ్లింది. తన కొడుకు మళ్లీ తమపై దాడి చేస్తాడనే భయంతో చిట్టెమ్మ అతడి నుంచి మనవళ్లను కాపాడేందుకు గొడ్డలితో దాడి చేసి అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.