Viral Video: దాహంతో అలమటిస్తున్న పెంగ్విన్.. ఆ వ్యక్తి చేసిన పనికి నెట్టిజెన్స్ ఫిదా!
ప్రకృతి ప్రేమికులు జంతు ప్రేమికుల లాగే పక్షుల ప్రేమికులు కూడా ఉంటారు. కొందరు పక్షుల మీద ప్రేమతో అనేక
- By Anshu Published Date - 05:04 PM, Sat - 22 October 22

ప్రకృతి ప్రేమికులు జంతు ప్రేమికుల లాగే పక్షుల ప్రేమికులు కూడా ఉంటారు. కొందరు పక్షుల మీద ప్రేమతో అనేక రకాల పక్షులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మరి కొందరు మాత్రం వాటిని బంధించడం ఇష్టం లేక ఇంటి టెర్రెస్ పై ఆహారాన్ని పెడుతూ ఉంటారు. అలాగే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల పక్షులు మనకు దగ్గరగా వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు కొంతమంది వారు తినే ఆహారాన్ని తినుబండరాలను వాటికీ ఇస్తూ ఉంటారు.
మరి కొంతమంది అయితే పక్షుల కోసం అదేపనిగా వెళ్లి వాటికి ఆహారాన్ని మేతగా వేస్తూ ఉంటారు. పక్షులకు ఆహారం వేయడం అన్నది చాలా మంచి పని. అలా చేయడం వల్ల వాటి ఆకలి తీరుతుంది మనకు పుణ్యం కూడా లభిస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కూడా అలాంటి పనే చేశాడు. ఒక పెంగ్విన్ దాహంతో అల్లాడుతుండగా అటువంటి సమయంలో ఒక వ్యక్తి చేసిన పనికి నెట్టిజెన్స్ ఫిదా అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
చిన్న రాళ్ళల్లో ఒక పెంగ్విన్ పిల్ల దాహంతో అల్లాడుతోంది. ఇది ఆ పెంగ్విన్ పిల్ల చూడడానికి ఒక కోడి పిల్ల లాగా కనిపిస్తోంది. ఆ పెంగ్విన్ పిల్ల దాహంతో అల్లాడుతూ ఉండగా అది గమనించిన ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తో ఆ చిట్టి పక్షికి నీటిని అందించాడు. అయితే కనీసం నిలబడటం కూడా రాని ఆ పెంగ్విన్ పిల్ల ఆ వ్యక్తి పోతున్న నీటిని కొంచెం కొంచెం గా తాగుతూ దాని దాహాన్ని తీర్చుకుంది. అయితే అందులో ఉన్న వ్యక్తి ఎవరు అన్నది తెలియదు కానీ ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే చిట్టి పెంగ్విన్ పరిస్థితి చూసి బాధపడుతున్నారు.