Plane Accident: విమానంలో చెలరేగిన మంటలు.. 113 మంది ప్రయాణికులు సేఫ్!
ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
- By Balu J Published Date - 10:24 AM, Thu - 12 May 22

ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో భారీ కుదుపులకు గురవుతున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానంలో గురువారం చైనా విమానాశ్రయంలో రన్‌వేపైకి దూసుకెళ్లిన తర్వాత మంటలు చెలరేగాయి. అయితే ప్రయాణికులు, సిబ్బంది “సురక్షితంగా బయటపడ్డారు” అని ఎయిర్‌లైన్ తెలిపింది.
113 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం చాంగ్‌కింగ్ నుండి టిబెట్‌లోని నైన్చికి వెళుతుండగా ప్రతికూల పరిస్థితుల వల్ల టేకాఫ్ అయ్యింది. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు అత్యవసర మార్గం ద్వారా బయటపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో 40మందికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
https://twitter.com/baoshitie1/status/1524578661386506240?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1524578661386506240%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fworld-news%2Ftibet-airlines-jet-overruns-runway-catches-fire-in-china-news-agency-afp-2968022