Allu Arjun: యూరప్ ట్రిప్ కు వెళ్లిన బన్నీ.. వీడియో వైరల్!
ఇవాళ.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. నేటితో అల్లు అర్జున్ 40 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.
- By hashtagu Published Date - 02:52 PM, Fri - 8 April 22

ఇవాళ.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. నేటితో అల్లు అర్జున్ 40 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్బంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ కు బయల్దేరాడు బన్నీ. ఆయనతో పాటు భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా ఉన్నారు. ఎయిర్ పోర్టులో వీరు వెళ్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మరోవైపు యూరప్ ట్రిప్ ను ముగించిన తర్వాత పుష్ఫ-2 షూటింగ్ లో బన్నీ పాల్గొంటాడని సమాచారం. మరోవైపు తమ ఫ్యాన్స్ నటుడు బర్త్ డే సందర్భంగా పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు.