Vanamahotsavam : 30న రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవం – పవన్ కళ్యాణ్
ప్రతి ఒక్కరు ఈ వనమహోత్సవంలో పాల్గొనాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు
- By Sudheer Published Date - 08:06 PM, Sat - 24 August 24

30న రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవం (Vanamahotsavam ) సందర్బంగా ప్రతి ఒక్కరు ఈ వనమహోత్సవంలో పాల్గొనాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలపై పవన్ కల్యాణ్ నేడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 50 శాతం మేరకు పచ్చదనం ఉండాలని, ఇందులో భాగంగా అర్బన్ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు నిర్దేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆగస్టు 30న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో ప్రధానంగా యువత భాగస్వామ్యం ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం రూ. 15.4 కోట్లు మంజూరు చేసిందని పవన్ తెలిపారు. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుగొండ, నెల్లిమర్ల, కదిరి, కాశీబుగ్గలో వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వచ్చే 100 రోజుల్లో 30 నగరవనాల పనులు పూర్తిచేస్తామన్నారు.
Read Also : Hydra Commissioner Ranganath : ‘హైడ్రా’ రంగనాథ్ ..గురించి అంత ఆరా..!!