UP Police : యూపీలో 29 మంది అక్రమ మద్యం వ్యాపారుల అరెస్ట్
అక్రమ మద్యం వ్యాపారులపై యూపీ పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. బండాలో 29 మంది మద్యం స్మగ్లర్లను యూపీ
- By Prasad Published Date - 06:59 AM, Sat - 24 December 22

అక్రమ మద్యం వ్యాపారులపై యూపీ పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. బండాలో 29 మంది మద్యం స్మగ్లర్లను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. 122 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో నిర్వహిస్తున్న అక్రమ మద్యం వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. అక్రమ మద్యం వ్యాపారులపై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న 29 మందిని బండా పోలీసులు అరెస్టు చేశారు. బులంద్‌షహర్‌లో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ.. అక్రమ మద్యం, మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడానికి, యువత భవిష్యత్తును కాపాడటానికి ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో పనిచేస్తోందని తెలిపారు.