TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త.. ఉదయాస్తమాన సేవా యాప్ ప్రారంభం
- By HashtagU Desk Published Date - 10:19 AM, Wed - 16 February 22

శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానంఈరోజు ఉదయాస్తమాన సేవా యాప్‌ను ప్రారంభించనుంది. కరోనా కారణం ఉదయాస్తమాన సేవను తాత్కాలికంగా ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెంకన్న భక్తుల కోసం ఉదయాస్తమాన సేవను టీటీడీ అందుబాటులోకి తేనుంది. ఈ క్రమంలో ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన భక్తులకు మాత్రమే ప్రత్యేకంగా ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను టీటీడీ కేటాయించనుంది.
ఇక ఈ యాప్ ద్వారా భక్తులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని టీడీపీ అధికారులు తెలిపారు. ఉదయాస్తమాన సేవ ద్వారా స్వామి వారిని అతి దగ్గరగా చూసే వీలు లుగుతుంది. ఈ నేపధ్యంలో శ్రీవారి భక్తులు ఎక్కువ మంది కోటి రూపాయలు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది. మరి ఎంతమంది భక్తులు ఈ యాప్‌ను యూజ్ చేసుకుంటారో చూడాలి. ఇకపోతే ఇప్పటికే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను రోజుకు పదిహేను వేల చొప్పున టీటీడీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.