Clashes : రాజులస్వామి ఉత్సవంలో ఘర్షణ..కర్రలు, రాళ్లతో దాడులు..!!
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోటలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
- By Hashtag U Published Date - 08:05 AM, Wed - 27 April 22

శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోటలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్త వాతావారణానికి దారితీసింది. రాజుస్వామి ఉత్సవంలో తలెత్తిన వివాదం ముదిరి…కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఉత్సవంలో ఎడ్ల బండ్లు లాగడంలో ముందుండాలని రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసిన పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.