Two earthquakes: నేపాల్‌లో భూకంపాలు.. భారత్‌లో కూడా ప్రకంపనలు
నేపాల్ (Nepal)లో బుధవారం అర్థరాత్రి గంట వ్యవధిలో రెండు భూకంపాలు (Two earthquakes) సంభవించాయి. నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ నేపాల్ ప్రకారం.. బగ్‌లుంగ్ జిల్లాలో ప్రకంపనల తీవ్రత 4.7, 5.3గా నమోదైంది. నివేదికల ప్రకారం.. నేపాల్‌లోని బగ్‌లుంగ్ లో భూకంపం సంభవించింది.
- By Gopichand Published Date - 07:48 AM, Wed - 28 December 22

నేపాల్ (Nepal)లో బుధవారం అర్థరాత్రి గంట వ్యవధిలో రెండు భూకంపాలు (Two earthquakes) సంభవించాయి. నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ నేపాల్ ప్రకారం.. బగ్‌లుంగ్ జిల్లాలో ప్రకంపనల తీవ్రత 4.7, 5.3గా నమోదైంది. నివేదికల ప్రకారం.. నేపాల్‌లోని బగ్‌లుంగ్ లో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం గురించి సమాచారం తెలియలేదు.
NEMRC నుండి రీడింగుల ప్రకారం.. అర్థరాత్రి 01:23 (స్థానిక కాలమానం)కి బగ్లుంగ్ జిల్లాలో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. రెండవ భూకంపం బగ్లుంగ్ జిల్లాలోని ఖుంగా చుట్టూ అర్థరాత్రి 02:07 (స్థానిక కాలమానం)కి సంభవించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని NEMRC ట్వీట్ చేసింది.
నేపాల్‌లో సంభవించిన భూకంప ప్రభావం ఉత్తరాఖండ్‌లోనూ కనిపించింది. ఉత్తరకాశీలో స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటలకు ఇది చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో ఉత్తరాఖండ్‌లో చాలాసార్లు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.