Hyderabad : హైదరాబాద్‌లో విషాదం.. గుర్రాన్ని కాపాడేందకు వెళ్లి..?
హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్‌లోని మూసీ నదిలో గుర్రాన్ని రక్షించేందుకు
- Author : Prasad
Date : 27-04-2023 - 7:53 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్‌లోని మూసీ నదిలో గుర్రాన్ని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బాధితులు మహ్మద్ సైఫ్, అషు సింగ్ గా పోలీసులు గుర్తించారు. తమ గుర్రాన్ని నడక కోసం తీసుకొని మూసీ నది దగ్గరకు వెళ్లారు. గుర్రం నీటిలోకి వెళ్లి ఒక్కసారిగా మునిగిపోవడంతో వారు ఆ గుర్రాన్ని కాపాడేందకు మూసీలోకి దిగారని పోలీసులు తెలిపారు. అషు సింగ్‌కు ఈత తెలియకపోయినా గుర్రాన్ని రక్షించడానికి పరుగెత్తాడని.. దీంతో ఆషు సింగ్ మునిగిపోతుండటంతో.. మహ్మద్ సైఫ్ నదిలోకి దిగి అషును లాగేందుకు ప్రయత్నించాడు. అయితే వారిద్దరూ బయటకు రాలేక చివరకు గుర్రంతోపాటు నీటిలో మునిగిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను నదిలో నుంచి వెలికితీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.