HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Twitter Celebrates Indias Historic 1983 World Cup Win Against West Indies

India’s World Cup: అపూర్వ విజయానికి 39 ఏళ్లు

ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు ఇండియన్‌ టీమ్‌ ఓ సూపర్‌ పవర్‌. ఆటలో అయినా, ఆదాయంలో అయినా ఇండియన్‌ క్రికెట్‌కు తిరుగులేదు.

  • Author : Naresh Kumar Date : 25-06-2022 - 4:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Cup
World Cup

ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు ఇండియన్‌ టీమ్‌ ఓ సూపర్‌ పవర్‌. ఆటలో అయినా, ఆదాయంలో అయినా ఇండియన్‌ క్రికెట్‌కు తిరుగులేదు. అయితే దానికి 1983 వరల్డ్‌కప్‌లోనే బీజం పడింది. అప్పటికి రెండుసార్లు విశ్వవిజేత అయిన వెస్టిండీస్‌ను ఫైనల్లో మన కపిల్‌ డెవిల్స్‌ మట్టి కరిపించారు. ఆ మెగా టోర్నీ మొత్తం కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి నడిపించిన కపిల్‌.. ఆ తర్వాతి కాలంలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం 183 రన్స్‌కే ఆలౌటైనా.. ఆ తర్వాత విండీస్‌ను 140 రన్స్‌కే కట్టడి చేసి ఎవరూ ఊహించని విజయాన్ని సాధించారు. ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో బాల్కనీలో 1983 వరల్డ్‌కప్‌ను సగర్వంగా అందుకున్నాడు కపిల్‌ దేవ్‌. ఫైనల్‌ మ్యాచ్‌ డేంజరస్‌ వివ్‌ రిచర్డ్స్‌ను ఔట్‌ చేయడానికి కపిల్‌ దేవ్‌ వెనక్కి పరుగెత్తుతూ అందుకున్న క్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
1983 వరల్డ్‌కప్‌లో మన టీమ్‌ ఇలాంటి అద్భుతం చేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు.

కేవలం 24 ఏళ్ల 170 రోజుల వయసులో కపిల్‌ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌ టైటిల్ అందుకున్న యంగెస్ట్‌ కెప్టెన్‌ అతడే. ఆ టోర్నీలో అజేయులుగా పేరున్న వెస్టిండీస్‌ టీమ్‌ను రెండుసార్లు ఓడించింది. 83 వరల్డ్ కప్ చారిత్రక విజయం సాధించి నేటితో 39 ఏళ్లు అయిన సందర్భంగా ట్విటర్‌లో ఫ్యాన్స్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇండియన్‌ క్రికెట్‌ను మార్చేసిన రోజును గుర్తు చేసుకుంటూ.. కపిల్‌ డెవిల్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 1983 తర్వాత 28 ఏళ్లకు మళ్లీ 2011లో ధోనీ కెప్టెన్సీలో రెండోసారి వరల్డ్‌కప్‌ గెలిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1983 World Cup
  • celebrations
  • india
  • twitter

Related News

The 1983 Cricket World Cup... Here is how that victory under Kapil Dev's captaincy was achieved.

Kapil Dev: క్రికెట్ వరల్డ్ కప్‌ 1983.. 43 ఏళ్ల తర్వాత కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఆ గెలుపు ఎలా సాధ్యమైందంటే…

భారత క్రికెట్ గమనాన్ని, దేశంలో ఈ ఆట పట్ల ఉన్న క్రేజ్‌ను శాశ్వతంగా మార్చేసిన అద్భుతమైన రోజు జూన్ 25. సరిగ్గా 1983లో ఇదే రోజున కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా అండర్ డాగ్స్‌గా (పసికూనగా) బరిలోకి దిగి, అప్పటివరకు ప్రపంచ క్రికెట్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న బలమైన వెస్టిండీస్‌ను మట్టికరిపించి తొలి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ చారిత్రాత్మక ఫైన

    Latest News

    • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

    • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

    • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd