Trump: ట్రంప్ ట్రావెల్ బ్యాన్.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన కఠిన మైన ఇమ్మిగ్రేషన్ విధానాలను ముందు తెచ్చారు.
- By Kavya Krishna Published Date - 01:47 PM, Thu - 5 June 25

Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన కఠిన మైన ఇమ్మిగ్రేషన్ విధానాలను ముందు తెచ్చారు. జాతీయ భద్రతను ధ్యానం లో ఉంచుకుంటూ ట్రంప్ తాజా ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 12 దేశాల పౌరులకు అమెరికా లో ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది. అంతేకాకుండా మరో 7 దేశాలపై కఠిన ఆంక్షలు విధించారు. ఈ చర్యలు అమెరికా భద్రతను మెరుగుపరచడంలో కీలకమవుతాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఈ నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల పౌరులు ఇకపై అమెరికాలో అడుగుపెట్టలేరు. ఇది పర్యాటక, విద్య, వాణిజ్య వీసాలకు సంబంధించినదే కాదు, వలస వీసాలపైనా వర్తిస్తుంది. జాతీయ భద్రతను ప్రమాదపెట్టే అవకాశమున్న ప్రదేశాలనుండి వలసదారుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేయడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు.
Bengaluru Stampede : ఆ పని చేయకండి అంటూ ఓ తండ్రి ఆవేదన కన్నీరు పెట్టిస్తుంది
బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనిజులా దేశాల పౌరులపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ దేశాలపై వీసా మంజూరు ప్రక్రియను కఠినతరం చేయడంతో పాటు, సమగ్ర చర్చల తర్వాతే అమెరికాలోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
ఇది ట్రంప్ చేపట్టిన తొలి ప్రయాణ నిషేధం కాదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన 2017లో అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలోనే 7 ముస్లిం మెజారిటీ దేశాలపై ప్రయాణ నిషేధం విధించారు. అప్పట్లో ఇది అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయినా, 2018లో సుప్రీంకోర్టు ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని సమర్థించింది. తాజా చర్యలు కూడా ఇదే విధానానికి కొనసాగింపుగా పరిగణించవచ్చు.
“అమెరికా ప్రజల భద్రతే మా మొదటి కర్తవ్యం. రాడికల్ ఉగ్రవాదులను దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడమే నా ఈ నిర్ణయానికి కారణం,” అని ట్రంప్ ప్రకటించారు. కొన్ని దేశాల వీసా ఓవర్‌స్టే రేట్లు అధికంగా ఉండటంతో, ఈ దేశాల పౌరులకు వీసాల జారీపై మరింత నియంత్రణలు తీసుకొస్తున్నట్టు వివరించారు.
ఈ కొత్త ట్రావెల్ బ్యాన్ B-1 (వ్యాపారం), B-2 (పర్యాటకం), F (విద్యార్థి), M (టెక్నికల్ ట్రైనింగ్), J (ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్) వీసాలపైనా వర్తిస్తుంది. దీనివల్ల ఆయా దేశాల విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, శిక్షణార్థులు అమెరికా చేరే అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయి.
PM Modi : పేదల సంక్షేమానికి కట్టుబడిన ఎన్‌డీఏ ప్రభుత్వం: ప్రధాని మోడీ