TRS vs BJP : ప్రగతి భవన్‌కు చేరకున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాసేపట్లో..?
- Author : Prasad
Date : 26-10-2022 - 10:41 IST
Published By : Hashtagu Telugu Desk
మోయినాబాద్ ఫాంహౌజ్ నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మొదటగా కారులో వెళ్లగా.. మరో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మాత్రం పోలీసు వాహనంలో తీసుకు వెళ్లారు. ఫాంహౌజ్ పైలెట్ రోహిత్ రెడ్డిది కావడంతో ఆయన స్టేట్‌మ్మెంట్‌ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్‌కు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చేరుకున్నారు. జరిగిన ఘటనపై నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్, మంత్రులకు వివరించనున్నారు. ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు.మరో వైపు ఇదంతా టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేల్లో మళ్లీ పోటీ చేస్తే ఒక్కరైనా గెలుస్తారా అంటూ బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు.