TS: విషాదం…ముగ్గురు చిన్నారులు జలసమాధి..!!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని సోలిపూర్ లో విషాదం నెలకొంది. సోలిపూర్ శివారులోని ఓ వెంచర్ నీటగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
- Author : hashtagu
Date : 26-09-2022 - 3:52 IST
Published By : Hashtagu Telugu Desk
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని సోలిపూర్ లో విషాదం నెలకొంది. సోలిపూర్ శివారులోని ఓ వెంచర్ నీటగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు చిన్నారులు 10ఏళ్లలోపు ఉండటం…స్థానికంగా అందర్నీ కంటతడిపెట్టించింది. దసరా సెలవులు కావడంతో…చేపలు పట్టాలని నీళ్లలోకి దిగారు. నీటి గుంత లోతుగా ఉండటంతో …ముగ్గురు చిన్నారులు మునిగిపోయారు. ముగ్గురు పదేళ్లలోపు కావడంతో ఎలా రక్షించుకోవాలతో తెలియక ప్రాణాలు విడిచారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు…ఘటనాస్థలానికి చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న తమ పిల్లలను చూసి బోరున విలపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.