Tomato Prices: టమాటా ధరలు తగ్గేది అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి.. రేట్స్ తగ్గుదలకు కారణమిదే..?
చాలా కాలంగా పెరుగుతున్న టమాటా ధరలు (Tomato Prices) సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. వీటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రిటైల్ మార్కెట్‌లో మాత్రం ధర ఆకాశాన్ని తాకుతోంది.
- By Gopichand Published Date - 12:43 PM, Sat - 22 July 23

Tomato Prices: చాలా కాలంగా పెరుగుతున్న టమాటా ధరలు (Tomato Prices) సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. వీటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రిటైల్ మార్కెట్‌లో మాత్రం ధర ఆకాశాన్ని తాకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టమాటా ధర ఎప్పుడు తగ్గుతుందనేది పెద్ద ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ దీని గురించి సమాచారం ఇస్తూ.. రాబోయే రోజుల్లో టమోటా ధర తగ్గుదల నమోదు కావచ్చని తెలిపింది. మరికొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి కొత్త పంటల రాక ప్రారంభం కానుంది. దీని తరువాత టమోటా ధర తగ్గుదల నమోదు కావచ్చు.
ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభలో టమాటా ధర పెరగడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మరికొద్ది రోజుల్లో మార్కెట్‌లోకి కొత్త టమోటా పంటలు రావడం ప్రారంభమవుతాయని లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇందులో మహారాష్ట్రలోని నారాయణగావ్, ఔరంగాబాద్, నాసిక్ నుంచి పెద్ద సంఖ్యలో టమాటా రానుంది. దీంతో పాటు మధ్యప్రదేశ్ నుంచి కొత్త టమాట పంట కూడా రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పంటలు మార్కెట్‌లోకి రావడంతో టమాటా ధర తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: 38 Girls Sick: మలేరియా నివారణ మాత్రలు మింగి 38 మంది విద్యార్థినులు అస్వస్థత
చాలా నగరాల్లో తక్కువ ధరకు టమాటాలు
ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి అనేక రాష్ట్రాల్లో నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ వంటి వ్యవసాయ మార్కెటింగ్ ఏజెన్సీల ద్వారా తక్కువ ధరకు టమోటాలు విక్రయిస్తున్నాయని వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి అశ్విని చౌబే పార్లమెంటుకు తెలియజేశారు. తొలిదశలో టమాట కిలో రూ.90కి విక్రయించగా, జూలై 16 నాటికి కిలో రూ.80కి తగ్గింది. అదే సమయంలో నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ కేంద్రాలలో ఇప్పుడు టమోటాలు కిలో రూ.70కి లభిస్తున్నాయన్నారు. టమాటా ధర పెరగడం వల్ల చాలా మంది రైతులు దీనిని సాగుచేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మార్కెట్‌లోకి టమాటాలు పెద్ద ఎత్తున రానున్నాయి. దీంతో రేటు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.