Super Mom: మీరు సూపర్ మామ్ అనిపించుకోవాలంటే…ఈ టిప్స్ ఫాలో అవ్వండి…!
మొదటిసారి తమ పిల్లలను చేతుల్లోకి తీసుకున్న క్షణాలు ప్రతి తల్లిదండ్రులకు గుర్తుండిపోతాయి. అప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకోవడం...ఒక గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు.
- By Hashtag U Published Date - 06:20 AM, Thu - 17 February 22

మొదటిసారి తమ పిల్లలను చేతుల్లోకి తీసుకున్న క్షణాలు ప్రతి తల్లిదండ్రులకు గుర్తుండిపోతాయి. అప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకోవడం…ఒక గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు. బిడ్డ పుట్టిన తర్వాతే…తల్లిదండ్రులకు జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా పిల్లల బాధ్యతలు తల్లిపై ఎక్కువగా ఉంటాయి. పిల్లలు పెరుగుతున్నా కొద్దీ తల్లికి బాధ్యతలు పెరుగుతుంటాయి. సమయానికి ఆహారం అందించడం, పాఠశాలకు తీసుకెళ్లడం, ఆలనాపాలనా చూసుకోవడం ఇలా ప్రతిదీ తల్లి చూసుకోవాల్సిందే. ఈ సమయంలో తల్లి ఎంతో అలసిపోతుంది. తన నిద్రను కోల్పోయే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. వీటన్నింటిని సమర్ధవంతంగా నిర్వహిస్తుంది… అయితే మీరూ సూపర్ మామ్ అనిపించుకోవాలంటే ఏం చేయాలి.
మీరు నిజంగా సూపర్ మామ్ అనిపించుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.
1. మీ కుటుంబంతో బాధ్యతలను పంచుకోండి…
చిన్నపిల్లలున్న తల్లికి సమయం ఏర్పడదు. రాత్రిళ్లు మేల్కోవల్సి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోలేరు. ఇలాంటి సందర్బాల్లో కొంత సమయాన్ని తల్లలు కేటాయించుకోవాలి. మీ బాధ్యతలను కొన్నింటిని కుటుంబంలోని ఇతర సభ్యులకు అప్పగించాలి.
2. ప్రతిరోజూ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోవాలి…
ఇవాళ ఏం చేయాలి…రేపు ఏం చేయాలి….ఇలాంటివన్నీ కూడా ముందు రోజే ప్లాన్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే…అవసరంలేని విషయాల గురించి ఆలోచించాల్సిన పని ఉండదు.
3. మీకోసం సమయాన్ని కేటాయించుకోవడం…
మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ …మీకోసం కొంత సమయాన్ని తప్పకుండా కేటాయించుకోవాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు. ఉదయం కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేసుకోవచ్చు. మీ పిల్లలు నిద్రిస్తున్న సమయంలో స్నేహితులతో మాట్లాడుకోవచ్చు.
4. తరచుగా వ్యాయామం.
మీకు వీలైనంత తరచుగా వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోండి. మీ పిల్లల ఆలనాపాలనా చూసుకునే సమయంలో మీరు చాలా నీరసంగా ఉంటారు. వ్యాయామం తరచుగా చేసినట్లయితే మీరు ఒత్తిడికి గురికారు. సూపర్ మామ్ లకు టన్నుల కొద్దీ శక్తి అవసరమన్న విషయాన్ని గర్తుంచుకోవాలి.
5. సమయానికి భోజనం చేయాలి….
మొదటిసారిగా తల్లి అయిన స్త్రీకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంటి పనులు చూసుకోవాలి…పిల్లవాడి మంచి చెడు చూసుకోవాలి. ఈ సమయంలో తల్లులకు ఆహారం తీసుకునే సమయం కూడా ఉండద. అందుకే రోజులో మూడు సార్లు ఆహారం తీసుకునేందుకు ప్లాన్ చేసుకోండి.
6. వారానికోసారి బయటకు వెళ్లండి…
ఇంటి పనులు, పిల్లల పనుల్లో బిజీగా ఉంటూ బయటి ప్రపంచాన్నే మర్చిపోతారు తల్లులు. అలాంటి పొరపాటు మీరు చేయకండి. వారానికోసారి లేదా నెలకు రెండుసార్లు మీ భర్తతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి.
7. స్నేహితులతో తరచుగా మాట్లాడుతూ ఉండండి…
మొదటిసారి తల్లి అయ్యాక…ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతాము. ఇల్లే ప్రపంచం…పిల్లలే ప్రపంచం అన్నట్లుగా మారుతుంది. అలాంటి సమయంలో మీరు ముఖాన్ని అద్దంలో చూసుకుని షాక్ తినే రోజులు కూడా వస్తుంటాయి. కాబట్టి మీకు సన్నిహితంగా ఉండే స్నేహితులతో తరచుగా మాట్లాడుతుండండి.
8. ఇతర విషయాలపై శ్రద్ద వహించండి…
తల్లలు ఇతర పనులపై కూడా శ్రద్ధ పెట్టాలి. మిమ్మల్ని సూర్తిగా తీసుకునేందుకు ఏదైనా కొత్తగా ఆలోచించండి. కొత్త భాషను నేర్చుకోవడం లేదా కొత్త పుస్తకాన్ని చదవడం. ఇలా చేసినట్లయితే మీలో ఉన్న ప్రతిభను బయటకు తీయవచ్చు.
9. వీలైనప్పుడల్లా నిద్రపోండి….
తల్లులకు నిద్రపోయే సమయం చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలతో సమయం అంతా గడిచిపోతుంది. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడల్లా నిద్రపోయేందుకు ప్లాన్ చేసుకోండి.
10. ఆచారాలను పాటించాలి….
రాత్రిపూట గ్రీన్ టీ తాగడం, ఇష్టమైన పుస్తకాన్ని చదవడం, లేదా టీవీ చూడటం ఇలా మీకు నచ్చిన పనులు చేస్తుండాలి. మిమ్మల్ని రీబూట్ చేసేందుకు సహాపడేవి ఏదైనా చేయాలి.
అమ్మ శక్తి సామార్థ్యాలను తక్కువగా అంచనా వేయలేం. అన్నింటినీ సమర్ధవంతంగా నిర్వహించే శక్తి అమ్మలో ఉంటుంది. కాబట్టి అమ్మ ఎప్పటికీ సూపర్ మామ్.