IND v BAN: హైదరాబాదీ తిలక్ వర్మ వన్డే అరంగేట్రం
ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియాలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి
- Author : Praveen Aluthuru
Date : 15-09-2023 - 6:27 IST
Published By : Hashtagu Telugu Desk
IND v BAN: ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియాలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చారు. ఈ నామమాత్రపు మ్యాచ్ లో తిలక్ వర్మ మొదటిసారి వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ మరియు సూర్యకుమార్ యాదవ్ కి కూడా జట్టులో స్థానం దక్కింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వరుసగా మూడవ మ్యాచ్ కి దూరమయ్యాడు. కాగా బంగ్లాదేశ్ తరపున తంజీబ్ షకీబ్ వన్డే అరంగేట్రం చేశాడు.
భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.
బంగ్లాదేశ్ జట్టు : షకీబ్ అల్ హసన్ , లిట్టన్ దాస్ , తాంజిద్ హసన్, అనముల్ హక్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
Also Read: Kakarakaya Ulli Karam Kura: వెరైటీగా ఉండే కాకరకాయ ఉల్లికారం కూర తిన్నారా.. తయారీ విధానం?