HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tik Tok Ban In America

Tik Tok Ban in America : అమెరికాలో టిక్ టాక్ నిషేధం..?

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై (Tic Tok) నిషేధం విధించేందుకు అమెరికా (America) చట్టసభలో

  • Author : Maheswara Rao Nadella Date : 14-12-2022 - 3:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tik Tok America
Tiktak

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై (Tik Tok) నిషేధం విధించేందుకు అమెరికా (America) చట్టసభలో రంగం సిద్ధమవుతోంది. ఆ దేశంలోని రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీలు ఒక బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టారు. అమెరికా వాసులపై నిఘా కోసం చైనా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చేమోనన్న ఆందోళనను ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మార్కో రూబియో, మైక్‌ గల్లాఘర్‌, డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం రష్యా, చైనాల ప్రభావం ఉన్న ఏ సోషల్‌ మీడియా కంపెనీనైనా బ్లాక్‌ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.

చైనా ప్రభుత్వంతో తాము డేటాను పంచుకోవడంలేదని టిక్‌టాక్‌ (Tik Tok) గతంలోనే చెప్పింది. ఈ నేపథ్యంలో మంగళవారం స్పందిస్తూ ‘‘రాజకీయ ప్రేరేపితమైన నిషేధం’’ అని వ్యాఖ్యానించింది. కొందరు అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు రాజకీయ ఉద్దేశాలతో ఈ బిల్లును ముందుకు తీసుకెళుతున్నారని పేర్కొన్నారు. దీని వల్ల అమెరికా జాతీయ భద్రతకు అదనంగా లభించే ప్రయోజనం ఏమీ లేదని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో మరోసారి టిక్‌టాక్‌పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు చట్టసభ ఎదుటకు రావడం గమనార్హం. ఇప్పటికే ట్రంప్‌ హయాంలో టిక్‌టాక్‌పై నిషేధానికి యత్నించారు. కానీ, అప్పట్లో అది సాధ్యం కాలేదు. 2020లో కొత్త వినియోగదారులు టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకుండా, ఇతర కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకొంది. అప్పట్లో టిక్‌టాక్‌ (Tik Tok) పలుమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ కేసుల్లో టిక్‌టాక్‌ గెలవడంతో నిషేధం అమల్లోకి రాలేదు.

Also Read:  WhatsApp Update : సరికొత్త ఫీచర్.. ఒకసారి చూడగానే మెసేజ్ మాయం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • ban
  • Tic Tok
  • USA
  • viral
  • world

Related News

LPL Financial opens first GCC outside US in Hyderabad

హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

LPL Financial  అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ ‘ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్’ తన మొట్టమొదటి అంతర్జాతీయ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో 1500 మంది టెకీలను నియమించుకోనుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 450కి పైగా జ

    Latest News

    • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

    • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

    • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

    • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

    • Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

    Trending News

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd