Bus Accident: జార్ఖండ్‌లో వంతెనపై నుండి నదిలో పడిన బస్సు.. ముగ్గురు మృతి
జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో శనివారం రాత్రి బస్సు వంతెనపై నుండి నదిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
- Author : Praveen Aluthuru
Date : 06-08-2023 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
Bus Accident: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో శనివారం రాత్రి బస్సు వంతెనపై నుండి నదిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 24 మంది గాయపడ్డారు. రాంచీ నుంచి గిరిదిహ్‌కి వెళ్తుండగా గిరిదిహ్ డుమ్రీ రోడ్డు వద్ద బస్సు అదుపుతప్పి బరాకర్ నదిలో పడటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
VIDEO | Three persons were killed and 24 others injured when a bus fell into a river from a bridge in Jharkhand's Giridih district earlier tonight.
READ | https://t.co/fIinhjz9m1 pic.twitter.com/0SeXTw5tg9
— Press Trust of India (@PTI_News) August 5, 2023
ప్రమాదంపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా సహక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసదుపాయం కల్పించాలని సూచించారు. అయితే బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Hyderabad: కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, 2BHK ఫ్లాట్