Hyderabad: కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, 2BHK ఫ్లాట్
జూలై 31న ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ వాసి సయ్యద్ సైఫుద్దీన్ మృతి చెందారు. కానిస్టేబుల్ కాల్చి చంపిన ముగ్గురు ముస్లిం ప్రయాణీకులలో బజార్‌ఘాట్ నివాసి సైఫుద్దీన్ ఒకరు
- By Praveen Aluthuru Published Date - 06:14 PM, Sat - 5 August 23

Hyderabad: జూలై 31న ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ వాసి సయ్యద్ సైఫుద్దీన్ మృతి చెందారు. కానిస్టేబుల్ కాల్చి చంపిన ముగ్గురు ముస్లిం ప్రయాణీకులలో బజార్‌ఘాట్ నివాసి సైఫుద్దీన్ ఒకరు. సైఫుద్దీన్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఒవైసి తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. ఈ మేరకు సయ్యద్ సైఫుద్దీన్ భార్యకు 2బీహెచ్‌కే ఫ్లాట్, ప్రభుత్వ ఉద్యోగం, వితంతు పింఛను అందజేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జియాగూడలో 2 బీహెచ్‌కే ఫ్లాట్, సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్ ఆసరా పెన్షన్ పథకం కింద నెలకు రూ.2016 వితంతు పింఛను అందించనున్నారు. షాహీన్‌ను కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా కూడా నియమించారు.
Also Read: MLC Kavitha: విభజించి పాలించుతో బిజెపి ఓట్లు దండుకునే ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత