FactCheck : పునీత్ మరణంపై దేవిశెట్టి పేరుతో తప్పుడు ప్రచారాలు.
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన తర్వాత ఎన్నో వార్తాసంస్ధలు ఆయనకు సంబంధించి కథనాలు ప్రచురించాయి.
- By Dinesh Akula Published Date - 04:03 PM, Fri - 5 November 21

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన తర్వాత ఎన్నో వార్తాసంస్ధలు ఆయనకు సంబంధించి కథనాలు ప్రచురించాయి. ఇక యూట్యూబ్, సోషల్ మీడియాల్లో అయితే విచ్చలవిడిగా కధనాలు వచ్చేశాయి. పునీత్ మరణానికి కారణం ఇది అంటూ వేలాది మెసేజ్‌లు షేర్‌లు అవుతున్నాయి. అందులో డాక్టర్ దేవిశెట్టి పేరుతో ప్రచారంలో ఉన్న ఈ కధనం.
వాస్తవానికి పై మెసేజ్‌లో చెప్పబడుతున్న డాక్టర్ దేవి శెట్టి, ‘నారాయణ హెల్త్’ ఛైర్మన్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల నెట్ వర్క్ ను నడుపుతోంది నారాయణ హెల్త్. డాక్టర్ దేవి శెట్టికి ఆపాదించబడిన వైరల్ మెసేజ్ గురించి నారాయణ హెల్త్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో, “డాక్టర్ దేవి శెట్టి నుండి వచ్చిందన్న ఈ సందేశం నకిలీదని మరియు అతని కార్యాలయం నుండి ఇది వెలువడలేదని ఎన్ హెచ్ స్పష్టం చేయాలనుకుంటున్నారు. అతనికి చేసిన ఏదైనా రిఫరెన్స్ లేదా ఆట్రిబ్యూషన్ తప్పు.” అని స్పష్టం చేసారు.
Also Read :
— Narayana Health (@NarayanaHealth) October 30, 2021
చివరగా.. సోషల్ మీడియాలో దేవిశెట్టి పేరుతో వైరల్ అవుతున్న వార్త ఫేక్.