Viral Fevers: అవి వైరల్ జ్వరాలు మాత్రమే, ఆందోళనవద్దు: ఏపీ వైద్యశాఖ!
ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ వైరల్ జ్వరాలు మాత్రమే ఉన్నాయని.. ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
- Author : Balu J
Date : 10-03-2023 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ వైరల్ జ్వరాలు మాత్రమే ఉన్నాయని.. ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇన్‌ఫ్లుయోంజా ‘ఎ’ రకానికి చెందిన H3N2 కేసులు చాలా స్వల్పంగానే ఉన్నాయని.. వాటి గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులు, ఇతర వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధి నిరోధక పెంచే పుడ్స్ క్రమంగా తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఏపీలో వారంరోజుల వ్యవధిలోనే వేల మంది జ్వరాల బారిన పడటంతో వైద్యశాఖ రంగంలోకి దిగి సర్వే జరిపింది.