Hydra Demolitions: దడ పుట్టిస్తున్న హైడ్రా.. కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతలు
హైడ్రా అధికారులు వారం రోజులుగా గండిపేట చెరువు సమీపంలోని ఖానాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో పర్యటించి, దాదాపు పది అక్రమ నిర్మాణాలను గుర్తించారు.
- By manojveeranki Published Date - 01:03 PM, Mon - 19 August 24

Hydra Demolitions: హైడ్రా (HYDRA) అధికారులు వారం రోజులుగా గండిపేట చెరువు సమీపంలోని ఖానాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో పర్యటించి, దాదాపు పది అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ముందస్తు నోటీసులు జారీ చేసినా, నిర్దేశించిన సమయంలో నిర్మాణదారుల నుంచి సమాధానం రాకపోవడంతో రెండు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. గండిపేట జలాశయం ఎఫ్‌టీఎల్ (Full Tank Level) చిలుకూరు, అప్పోజిగూడ గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిని ఆనుకుని ఉంటుంది.
ఓ రియల్ వ్యాపారి గండిపేట జలాశయం ఎఫ్‌టీఎల్‌ను కలుపుకొని వెస్ట్ సైడ్ అనే వెంచర్‌ను చేపట్టగా, కొంతమంది బడాబాబులు ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్లాట్లు కొనుగోలు చేసి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు అల్ట్రా-లాక్షరీ వసతులతో పాటు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ భవనాలు కనపడే విధంగా ఉన్నాయి.
ఈ క్రమంలో, అధికారులు సర్వే నిర్వహించి, అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మూడు భవనాలు మరియు చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నిర్మాణం అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో నివేదికను హైడ్రాకు సమర్పించారు.
అదనంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. హైడ్రా అధికారులు (Hydra Officials) మల్లికార్జున్, చరణ్ మరియు హెచ్‌ఎంఎస్‌ఎస్‌బీ డీజీఎం నరహరి, జలమండలి విజిలెన్స్ అధికారి (Vigilence Official) లక్ష్మీరెడ్డి, స్థానిక సీఐ పవన్‌కుమార్‌రెడ్డి మధ్‌సహం భారీ పోలీసు బలగాలతో కూల్చివేతలకు (Demo) హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కూల్చివేతలు కొనసాగాయి.
అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు భవనాలను, చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దేవలం వెంకటాపూర్ గ్రామ సమీపంలోని గండిపేట జలాశయం ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చి వేశారు. యజమానులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసినా, అధికారులు నిరసనలకు పక్కన పెట్టి అక్రమ నిర్మాణాలను తొలగించారు.