The Kerala Story: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ది కేరళ స్టోరీ, 200 కోట్ల దిశగా!
- By Balu J Published Date - 11:24 AM, Mon - 22 May 23

ది కేరళ స్టోరీ సినిమా కొన్ని రాష్ట్రాల్లో సినిమాను నిషేధించినప్పటికీ, మరికొన్ని రాష్ట్రాల్లో మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాను ప్రదర్శించనప్పటికీ.. కేరళ స్టోరీ సినిమా హవా తగ్గడం లేదు. విడుదలైన 9 రోజులకే వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా, తాజాగా మరో రికార్డ్ సృష్టించింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా 175 కోట్ల రూపాయల (గ్రాస్)లోకి చేరింది. ఎలాంటి ప్రచారం లేకపోయినా, కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది.
మరికొన్ని రోజుల్లో ఇది కచ్చితంగా 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుతుందని అంటోంది ట్రేడ్. ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై, దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్లో ఇది రెండోది. గతంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ది కేరళ ఫైల్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అదా శర్మ కీలక పాత్ర పోషించింది. మే 5న హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో విడుదలైంది.
Also Read: New Parliament Photos : కొత్త పార్లమెంట్ అదుర్స్.. ఓ లుక్కేయండి