Gold Washed Away: వర్షపు నీళ్ల ప్రభావానికి కొట్టుకోపోయిన షాపులోని బంగారం.. రూ.2 కోట్ల వరకు నష్టం.!
బెంగళూరును వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలం అవుతోంది. వర్షాలకు బెంగళూరు రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వర్షాల దాటికి విషాదకర ఘటన చోటుచేసుకుంటున్నాయి.
- By Anshu Published Date - 09:25 PM, Tue - 23 May 23

Gold Washed Away: బెంగళూరును వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలం అవుతోంది. వర్షాలకు బెంగళూరు రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వర్షాల దాటికి విషాదకర ఘటన చోటుచేసుకుంటున్నాయి. అండర్ పాస్ లో చిక్కుకుని ఏపీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందటం విషాదాన్ని నింపింది. అయితే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరులో వర్షం ముంచెత్తడంతో రూ.2 కోట్ల బంగారం వరదల్లో కొట్టుకుపోయింది. షాపుల్లోకి నీళ్లు చేరుకోవడంతో బంగారం కొట్టుకుపోయింది. దీంతో షాపు యజమాని లబోదిబోమంటున్నాడు. బెంగళూరులోని మల్లేశ్వ్ ప్రాంతానికి చెందిన బంగారం షాపు వరద నీటికి కొట్టుకుపోవడంతో రూ.కోట్ల నష్టం జరిగింది. తన షాపు కొట్టుకోపోవడానికి అధికారు తీరే కారణమని షాపు యజమాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దగ్గర్లో జరుగుతున్న నిర్మాణ పనులే దీనికి కారమని ఆరోపిస్తున్నాడు.
అయితే షాపులోకి నీళ్లు వచ్చే సమయంలో షట్టర్లను నిర్వాహకులు మూయలేదని తెలుస్తోంది. దీంతో వరద నీరు షాపులోకి రావడంతో బంగారం కూడా కొట్టుకుపోయింది. దీంతో మున్సిపల్ అధికారులకు షాపు యజమాని ఫోన్ చేయగా.. ఎవరూ స్పందించలేదు. దీంతో 80 శాతం బంగారం వరదనీటిలో కొట్టుకుపోయింది. దీని విలువ రూ. 2 కోట్లుగా ఉంటుందని యజమాని చెబుతున్నారు.
అయితే వర్షాల వల్ల బెంగళూరులో కాలవలు ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నాయి. రహదారులు అన్నీ చెత్తతో పేరుకుపోయాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. అధికారులు చెత్తాచెదారం, చెట్లను తొలగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 600 వరకు ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చాయి. అయితే అకాల వర్షాల వల్ల కర్ణాటకలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా.. తాజాగా 30 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఏపీకి చెందిన టెక్కీ బానురేఖ అండర్ పాస్ లో చిక్కుకోని మరణించగా.. ఆమె అంత్యక్రియలు ఇవాళ పూర్తయ్యాియ.