Delivery Girl: కస్టమర్ కు షాకిచ్చిన డైలివరీ గర్ల్… ఫైర్ అయిన నెటిజన్లు!
ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లు రాకతో ఇంటి వద్దనే ఫుడ్‌ని తెప్పించుకోవడం ప్రజలకు అలవాటుగా మారింది. చిన్నచిన్న వాటికి కూడా ఆర్డర్లు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే, పిల్లలకు మధ్యాహ్నం పుడ్ కూడా అన్లైన్ లో
- By Nakshatra Published Date - 10:00 PM, Wed - 8 March 23

Delivery Girl: ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లు రాకతో ఇంటి వద్దనే ఫుడ్‌ని తెప్పించుకోవడం ప్రజలకు అలవాటుగా మారింది. చిన్నచిన్న వాటికి కూడా ఆర్డర్లు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే, పిల్లలకు మధ్యాహ్నం పుడ్ కూడా అన్లైన్ లో పెట్టేస్తున్నారు. కరోనా నుంచి వీటికి ఆదరణ మరింత పెరిగింది. అయితే డెలివరీ బాయ్స్ కస్టమర్లకు ఫుడ్ డెలవరీ చేసే క్రమంలో పలు వింత ఘటనలు జరుగుతున్నాయి.
ఇటీవల టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో చాలా పనుల కోసం బయటకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. నిజంగా చెప్పలాంటే మనం కావాల్సిన ప్రతి వస్తువు బయటకు వెళ్లకుండానే ఇంటికి వస్తోంది. ఇక చేతిలో మొబైల్, అందులో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు నిమిషాల్లో కొన్నిసేవలు ఏదైన మనఇం టి ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతున్నాయి.
తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు షాకిచ్చింది డెలివరీ పార్టనర్. డెలివరీ పార్ట్‌నర్ కస్టమర్ ఇంటి ముందుకు వచ్చి అతనితో మాట్లాడటం ప్రారంభించింది. మీ ఫుడ్ ఆర్డర్ తీసుకువచ్చేందకు పన్నెండున్నర మైళ్లు దూరం 40 నిమిషాలపాటు డ్రైవ్ చేశానని చెప్పాడు. మీరిచ్చిన టిప్ 650తో నేను సంతోషంగా లేనని ఆమె చెబుతోంది.
అయితే కస్టమర్ అదనంగా చెల్లించేందుకు నిరాకరిస్తాడు. దీంతో డెలివరీ పార్టనర్‌కు చిరెత్తుకురావడంతో ఫుడ్ ప్యాకెట్‌ను తీసుకొని కస్టమర్‌కు ఇవ్వకుండానే
అక్కడి నుంచి వెళ్లిపోయింది. డ్రైవర్‌కు, కస్టమర్‌కు మధ్య జరిగిన పరస్పర సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Weight Loss Tips: బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు అస్సలు తీసుకోకూడదా? ఏది నిజం?
కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు. వీటిని పూర్తిగా తగ్గిస్తే బరువు తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే.. కాసేపు ఆగండి.