TG TET 2025 : టెట్ హాల్ టికెట్స్ విడుదల
TG TET 2025 : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి.
- By Kavya Krishna Published Date - 08:10 PM, Wed - 11 June 25

TG TET 2025 : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను tstet.cgg.gov.in లేదా tgtet.aptonline.in/tgtet/ వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు రెండు సెషన్లలో.. అంటే ఉదయం 9:00 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసేందుకు అభ్యర్థులు తమ జర్నల్ నంబర్ , పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలు ఉపయోగించాలి.
Avika Gor : అవికా గోర్ భర్త ఎలా ఉన్నాడో చూస్తారా..?
హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, ఫోటో, రూల్ నంబర్, సంతకం, పరీక్ష తేదీ, సమయం, కేంద్రం వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన సూచనలు ఉంటాయి. ఈ వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లు 8121045156, 8121045157, 8121045158 లేదా ఇమెయిల్: helpdesk.tstet@cgg.gov.in ద్వారా అధికారులను సంప్రదించాలి.
TS TET పరీక్ష విధానం:
పేపర్-1: ప్రాథమిక పాఠశాలల (1 నుండి 5వ తరగతి) ఉపాధ్యాయుల కోసం
పేపర్-2: ప్రాథమికోన్నత పాఠశాలల (6 నుండి 8వ తరగతి) ఉపాధ్యాయుల కోసం
ప్రతి పేపర్‌లో 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQs) ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్ష రోజు హాల్ టికెట్‌తో పాటు ఓరిజినల్ ఫోటో ఐడీ ప్రూఫ్ (ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్) తీసుకెళ్లడం తప్పనిసరి. అలాగే, పరీక్ష కేంద్రానికి కనీసం 30-45 నిమిషాల ముందుగా చేరుకోవాలని సూచించారు.
Kaleshwaram Project : ‘కాళేశ్వరం’ నిర్మాణమే తప్పు అంటున్న బీజేపీ ఎంపీ