Gujarat: గుజరాత్ లో దారుణం, కోతుల దాడిలో పదేళ్ల బాలుడు మృతి
కోతుల దాడిలో గుజరాత్ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటనలో బాలుడి పేగులు బయటపడ్డాయి.
- By Balu J Published Date - 01:02 PM, Wed - 15 November 23

Gujarat: కోతుల దాడిలో గుజరాత్ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటనలో బాలుడి పేగులు బయటపడ్డాయి. గుజరాత్ గ్రామాన్ని కోతుల భయాందోళనకు గురి చేసింది. పదేళ్ల బాలుడిని కోతి అతి కిరాతకంగా చంపిన కోతులు కడుపులోకి చీల్చి పేగులను చించివేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని సాల్కి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. దేహగాం తాలూకాలోని ఓ దేవాలయం సమీపంలో కోతుల దాడి జరిగిందని అటవీ అధికారులు తెలిపారు. బాధితుడిని దీపక్ ఠాకూర్‌గా గుర్తించారు.
బాలుడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే వైద్యులు అతనికి సహాయం చేయడం ప్రారంభించేలోపే చనిపోయాడు. దీపక్ చిన్న గ్రామంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో కోతుల గంపు ఒక్కసారిగా దాడి చేశాయి. కోతులు బాలుడిపైకి దూకి, బాలుడ్ని తీవ్రంగా గాయపర్చాయి. దాడిలో అతని పేగులు దెబ్బతిన్నాయి. తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు. ఒక వారం రోజుల్లో వ్యవధిలో గ్రామంలో కోతుల దాడి ఇది మూడవది.