HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Weather Report Today

Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు ‘వడగాలులు’…. హెచ్చరికలు జారీ..!

  • Author : HashtagU Desk Date : 17-03-2022 - 9:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
56
56

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఇంకా చెప్పాలంటే…పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 6-7 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా సింగరేణి బెల్ట్ లో ఈ వడగాలులు అధికంగా వీస్తున్నాయి. ఇకపోతే.. ఇవాళ, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండలో బుధవారం సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో నల్గొండలో మార్చి నెలలో నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఇదే. అంతకుముందు 2016 లో మార్చి 23న 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అలానే ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లోనూ బుధవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని… కాబట్టి ప్రజలు మధ్యాహ్నం పూట అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో వాతావరణం పొడిగా మారి ఉక్కపోత ఎక్కువైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • telangana
  • weather report

Related News

Alert for the people of AP: Heavy rain warning for these districts.

Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదు రోజులపాటు నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సం

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd