HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana To Deduct Green Fund From April

Green Fund: హరితహరం కోసం ‘హరితనిధి’.. వేతనాల్లో కోత!

రాష్ట్రంలో హరిత ఉద్యమానికి నిధులు సమకూర్చేందుకు రూపొందించిన మొట్టమొదటి హరిత నిధి తెలంగాణ గ్రీన్ ఫండ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ప్రజా ప్రతినిధుల జీతాలు, గౌరవ వేతనం మరియు వేతనాల నుండి వన్ టైం వార్షిక కంట్రిబ్యూషన్ తీసివేయడం ప్రారంభించనుందని అధికారులు తెలిపారు.

  • Author : Hashtag U Date : 19-02-2022 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Forest
Forest

రాష్ట్రంలో హరిత ఉద్యమానికి నిధులు సమకూర్చేందుకు రూపొందించిన మొట్టమొదటి హరిత నిధి తెలంగాణ గ్రీన్ ఫండ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ప్రజా ప్రతినిధుల జీతాలు, గౌరవ వేతనం మరియు వేతనాల నుండి వన్ టైం వార్షిక కంట్రిబ్యూషన్ తీసివేయడం ప్రారంభించనుందని అధికారులు తెలిపారు. వన్-టైమ్ కంట్రిబ్యూషన్ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో తీసుకోని మే లో చెల్లిస్తారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు గత అక్టోబర్‌లో రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ టీజీఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిలో భాగంగానే ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు, కార్పొరేషన్లు, సొసైటీలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ మరియు ఇతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు పాఠశాలలతో సహా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన అన్ని వర్గాల ఉద్యోగుల జీతాల నుండి గ్రీన్ ఫండ్ సహకారం అందివ్వనున్నారు.

హరితనిధికి విరాళాల ఉత్తర్వులు జారీ చేసినదాని ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు ఏడాదికి 6000రూపాయలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు, కార్పోరేషన్ల ఛైర్మన్లు ఏడాదికి 1200 రూపాయలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఏడాదికి 600 రూపాయలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు 120రూపాయల విరాళం అందివ్వనున్నారు.

ఇంజనీరింగ్ కాంట్రాక్టుల నుంచి 0.01శాతం, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 10శాతం, స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ ఒక్కో రిజిస్ట్రేషన్ కు 50 రూపాయలు, వాణిజ్య సముదాయాల ఒక్కో అనుమతికి వెయ్యి రూపాయలు, బార్లు, మద్యం దుకాణాల ఒక్కో అనుమతికి వెయ్యి రూపాయలు విరాళం సేకరించనున్నారు.

తెలంగాణ గ్రీన్ ఫండ్ కోసం విద్యార్థుల నుండి కూడా విరాళాలు సేకరించనున్నారు. పదోతరగతి వరకు విద్యార్థులు పది రూపాయల విరాళం, ఇంటర్ విద్యార్థుల విరాళం 15 రూపాయలు, డిగ్రీ విద్యార్థుల విరాళం 25 రూపాయలు, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల విరాళం 100 రూపాయలు అందివ్వనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • from the salaries
  • green fund
  • Haritha Nidhi
  • honorarium and remuneration of public representatives
  • one-time annual contribution
  • telangana government
  • Telangana Green Fund

Related News

Another Fantastic Piece of Good News for Women: Mahila Shakti Super Bazars

Telangana: మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త.. మహిళా శక్తి సూపర్ బజార్లు

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సెర్ప్ భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తొలి విడతగా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డీమార్ట్ తరహా మహిళా శక్తి సూపర్ బజార్లను, అలాగే ఖమ్మంలో లాజిస్టిక్స్ హబ్, రైస్‌మిల్లును ఏర్పాటు చేయనున్నారు. సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. అందుకు అవసరమైన భూసేకరణ కోసం జిల

  • Health Scheme for Telangana Government Employees

    Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం..

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd