Police Command Centre Features: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలెన్నో!
తెలంగాణలోని హైదరాబాద్ లో గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.
- By Balu J Updated On - 04:14 PM, Thu - 4 August 22

తెలంగాణలోని హైదరాబాద్ లో గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సెంటర్ ఏర్పాటు వల్ల రాష్ట్రవ్యాప్తంగా నేరాలు, చోరీల, సైబర్ క్రమ్స్ లాంటివి ఈ సెంటర్ ద్వారా పర్యవేక్షించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని CCTV ఫుటేజీలను పర్యవేక్షించే భారీ నిర్మాణం కాకుండా చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌గా ఉన్న టవర్ Aలో 20 అంతస్తులు, టవర్ Bలో 15 అంతస్తులు ఉన్నాయి. ఇది డయల్-100కి సంబంధించిన అన్ని బ్యాకప్‌లతో ‘టెక్నాలజీ ఫ్యూజన్ టవర్’గా పనిచేస్తుంది. B టవర్‌లో SHE టీం భద్రత, సైబర్, నార్కోటిక్స్, నేరాల శాఖలు, ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటాయి. ఈ భారీ భవనంలో 600 ఫోర్ వీలర్స్ వాహనాలు, 350 ద్విచక్ర వాహనాలు ఉండేలా పార్కింగ్ స్థలం ఉంది. ఈ టవర్ 272 అడుగుల ఎత్తులో, 6.42 లక్షల చ.అ.లలో నిర్మాణమైంది. సెంటర్‌లోని ఇతర టవర్‌లలో 480 సీట్ల ఆడిటోరియం, మీడియా, ట్రైనింగ్ సెంటర్ ఉన్నాయి.
E టవర్‌లో, CCTV పర్యవేక్షణకు సంబంధించిన విభాగాలు పనిచేసే చోట కమాండ్ కంట్రోల్, డేటా సెంటర్ ఉంటుంది. ఈ టవర్‌లో వార్ రూమ్, రిసీవింగ్ రూమ్ కూడా ఉన్నాయి. అంతేకాదు.. అత్యవసర కార్యకలాపాల కోసం హెలిప్యాడ్ కూడా ఉంది. తెలంగాణ పోలీసుల చరిత్రను ప్రదర్శించే మ్యూజియం, 360 డిగ్రీల వీక్షణ గ్యాలరీ లాంటివి 14, 15వ అంతస్తులను ఏర్పాటయ్యాయి. ఒక ‘గ్రీన్ బిల్డింగ్ ఉంది. అదనంగా, సోలార్ ప్యానెల్స్ 0.5 మెగా వాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఫర్నిచర్ రీసైకిల్ మెటీరియల్‌తో రూపొందించబడింది. ఇంకా.. యోగా సెంటర్, జిమ్ సెంటర్, వెల్‌నెస్ సెంటర్ ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు కమాండ్ కంట్రోల్ సెంటర్ గురువారం అందుబాటులోకి రాబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. కేసీఆర్ రాక సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
A truly world class Telangana State Police Integrated Command & Control Centre (TSPICCC) all set to be inaugurated by Hon’ble CM #KCR Garu tomorrow in Hyderabad
Possibly one of the most sophisticated Govt facility built by any Govt in India pic.twitter.com/pO5RkCjClV
— KTR (@KTRTRS) August 3, 2022
Related News

Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!
ప్రేమకు వయసుతో, మనుషుల మధ్య దూరంతో సంబంధం లేదు అని అంటూ ఉంటారు. ఈ ప్రేమ అనే రెండు అక్షరాల