Fitness Icon: జాతీయ స్థాయి ఘనత సాదించిన హైదరాబాద్ కానిస్టేబుల్
- By Hashtag U Published Date - 10:02 AM, Sun - 20 February 22

హైదరాబాద్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ డీఏ కుమార్ అద్భుతమైన ఘనత సాదించారు. మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీ 2022లో పాల్గొన్న కుమార్ నగరంలోని యువతకే కాకుండా పోలీసులందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. 2010 బ్యాచ్ కానిస్టేబుల్ గా ఎంపికైన కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కుమార్ ప్రస్తుతం నేషనల్ బాడీబిల్డర్. తెలంగాణ నుండి జాతీయ బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొన్నమొదటి పోలీసు కానిస్టేబుల్‌గా కుమార్ రికార్డు సొంతం చేసుకున్నారు.
ఈ ఘనతపై ఒక మీడియా ఏజెన్సీ తో మాట్లాడిన కుమార్ శరీరాన్ని ఫిట్‌నెస్‌గా ఉంచుకోవడం కష్తమైన పని అని, అయితే ఇష్టంతో చేస్తే దేన్నైనా సాదిన్చావచ్చని తెలిపారు. ప్రతిరోజూ సరైన ఆహారం తీసుకోవాలని, . సరైన ఆహారం లేకుండా, బాడీబిల్డింగ్ సాధ్యం కాదని కుమార్ తెలిపారు. తాను రోజు రోజూ 12 గంటలు డ్యూటీ చేస్తానని, దానితో పాటు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు లేచి, 7.30 వరకు, రాత్రి 10 నుంచి 11 గంటల వరకు వర్కవుట్ చేస్తానని కుమార్ తెలిపారు.
తాను మిస్టర్ ఇండియా 2022లో పాల్గొన్నానని కుమార్ తెలిపారు. ఇదివరకే తాను మిస్టర్ తెలంగాణలో రెండవ స్థానం, WTF పోటీలో 3వ స్థానం సాధించినట్లు, తన దగ్గర మొత్తం 10కి పైగా పతకాలు ఉన్నాయని ఇదంతా తన భార్య సహకారం, పోలీసు స్టేషన్‌లోని అధికారుల మద్దతుతోనే అయిందని కుమార్ తెలిపారు. సమాజంలోని యువత మద్యం, మత్తు పదార్థాలతో తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని వాటిని మానేసి, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని కుమార్ సూచిస్తున్నారు.