Breaking News : రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!!
ఇంటర్ ఫలితాలకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.
- Author : hashtagu
Date : 14-06-2022 - 12:44 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంటర్ ఫలితాలకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఏడాది దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా…సమధాన పత్రాల మూల్యంకనం 14 కేంద్రాల్లో కొనసాగింది. రేపు రిలీజ్ కానున్న ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ sbie.cgg.gov.in చూడవచ్చు. ఇదే వెబ్ సైట్ నుంచి రిజల్ట్స్ కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇక 10వ తరగతి ఫలితాల విషయానికొస్తే…జవాబు పత్రాల మూల్యాంకనం ఇంకా కొనసాగుతోంది. పదవ తరగతి ఫలితాలు జూన్ 25 న లేదా 26న ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పదోతరగతి పరీక్షా రిజల్ట్స్ వెలువడిన తర్వాత ఇంటర్ ఫస్టియర్ క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభం అవుతాయి. ఇంటర్ సెంకడియర్ క్లాసులు ఈ నెలల్లోనే ప్రారంభం కానున్నాయి. పదవ తరగతి వరకు పాఠశాలలు నిన్ననే ప్రారంభమైన విషయం తెలిసిందే.