New Job Vacanies: తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త…!!
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది.
- By Hashtag U Published Date - 12:51 AM, Thu - 14 April 22
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వరుసగా శుభవార్తే చెబుతోన్న తెలంగాణ ప్రభుత్వం..ఇప్పటికే 80వేల పైగా ఉద్యోగుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆర్థిక శాఖ తొలి విడతలో భాగంగా 30, 453 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. తాజాగా రెండో విడతలో భాగంగా బుధవారంనాడు నిరుద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. మరో 3, 334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
రెండో విడతలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన వాటిలో ఎక్సైజ్ , ఫారెస్ట్, ఆగ్నిమాపక శాఖలకు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఖళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మిగిలిన శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనుమతులపై కూడా ద్రుష్టి కేంద్రీకరించింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నాయి.