Tamilisai: అమిత్ షాతో తమిళిసై భేటీ
హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశం ముగిసింది.
- Author : Balu J
Date : 07-04-2022 - 3:32 IST
Published By : Hashtagu Telugu Desk
హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంక్షేమంపై హోంమంత్రితో చర్చించినట్లు తెలిపారు. అయితే అమిత్ షాతో తాను ఏం చర్చించానో వెల్లడించలేనని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే తాను ఎప్పుడూ ఆలోచిస్తానని, తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని గవర్నర్ స్పష్టం చేశారు. ఎవరి నుంచి సహాయం అందకపోయినా సానుకూలంగా ముందుకు సాగుతానని చెప్పింది. మేడారంలో ప్రభుత్వం ప్రోటోకాల్‌ను పాటించడం లేదని తాను అనడాన్ని తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. యాదాద్రిలో తనకు జరిగిన తప్పుడు ప్రవర్తనపై మీడియా ఊహాగానాలేనని ఆమె స్పష్టం చేశారు. రెండేళ్లలో ఒకటి రెండు సార్లు మాత్రమే బీజేపీ నేతలను కలిశానని ఆమె చెప్పారు.