Governor Tamilisai Vs CM Kcr : కేసీఆర్ వైఖరి నన్ను బాధించింది.. పంద్రాగస్టు ప్రసంగంలో గవర్నర్ తమిళిసై
Governor Tamilisai Vs CM Kcr : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ వైఖరి తనను చాలా బాధించిందని వెల్లడించారు.
- By Pasha Published Date - 12:41 PM, Tue - 15 August 23

Governor Tamilisai Vs CM Kcr : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ వైఖరి తనను చాలా బాధించిందని వెల్లడించారు. గవర్నర్, సీఎం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె.. అక్కడి జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ వెళ్లకపోవడం బాధాకరమన్నారు. తాను గవర్నర్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనతో ఇలాగే వ్యవహరిస్తున్నారని చెప్పారు. గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం కేసీఆర్ గైర్హాజరవడం మంచిది కాదన్నారు.
Also read : Group – 3 Exam : గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఛాన్స్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే ?
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో కేసీఆర్, గవర్నర్ ఒకే వేదికపై(Governor Tamilisai Vs CM Kcr) కనిపించారు. ఇద్దరూ పలకరించుకున్నారు. రాజ్ భవన్ లో జరిగిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. దీంతో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు తగ్గినట్లు అనిపించింది. పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా తమిళిసై ఇటీవల ఆమోదించారు. ఇక గొడవంతా సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఈరోజు (ఆగస్టు 15న) ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.