CJ Satish Chandra Sharma : జడ్జి సర్.. మీరు సూపర్
ఓ హోం గార్డు...విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నాడు. ఆయన పని తనానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్రతి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఫిదా అయ్యారు.
- By Hashtag U Published Date - 01:48 PM, Fri - 8 April 22

ఓ హోం గార్డు…విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నాడు. ఆయన పని తనానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్రతి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఫిదా అయ్యారు. ప్రతిరోజు కారులో వెళ్తూ హోంగార్డు పనితనాన్ని గమనిస్తున్నారు. ఆయనను ఓ రోజు అభినందించాలని సీజే భావించారు.
ఇవాళ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ రోజులాగే తన అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు బయలుదేరారు. అబిడ్స్ మీదుగా వెళ్తూ రోడ్డు పక్కన కారు ఆపారు. బాబు జగ్జివన్ రామ్ విగ్రహం వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అష్రఫ్ అలీని సీజే అభినందించారు. అష్రఫ్ అలీకి పుష్పగుచ్చం అందించారు సీజే. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను అభినందించడంతో అలీ ఆనందంతో ఉప్పొంగిపోయారు.