Telangana: 29న తెలంగాణ కేబినెట్ భేటీ ..ఎందుకంటే?
గవర్నర్ కోటాలో రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక్కొక్కరు గవర్నర్ తీరుపై మండిపడుతున్నారు.
- By Praveen Aluthuru Published Date - 08:42 PM, Tue - 26 September 23
Telangana: గవర్నర్ కోటాలో రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక్కొక్కరు గవర్నర్ తీరుపై మండిపడుతున్నారు. ఆమె బీజేపీ పార్టీకి పని చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 29న సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ నూతన సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సమీపిస్తోన్న వేళ కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ మంత్రివర్గ సమావేశానికి గవర్నర్ తమిళిసై కారణమని తెలుస్తుంది. గవర్నర్ కోటాలో రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంతోనే మంత్రివర్గ సమావేశం జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
Also Read: Ayyanna Patrudu : హరికృష్ణకు టీ మోసిన కోడలి నాని.. ఇప్పుడు నందమూరి కుటుంబం నాశనం కోరుకుంటున్నాడు..