HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Assembly Polls Palle Gosa Bjp Bharosa Campaign To Being On July 21

BJP Campaign: ‘పల్లె గోస – బీజేపీ భరోసా’

కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది.

  • Author : Balu J Date : 14-07-2022 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp
Bjp

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. జూలై 21 నుంచి ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరుతో 15 ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనుంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ..  “2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి పూర్తిగా సిద్ధమైందని, ఆ బూత్ బలోపేతం కార్యక్రమం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణకు 30 మంది కేంద్ర మంత్రులు కూడా రానున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు సంకల్పించారని, అందుకే లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారని తరుణ్ చుగ్ అన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా తెలంగాణపై సానుకూల ప్రభావం చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా తెలంగాణపై సానుకూల ప్రభావం చూపిందని, ఇది వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని పార్టీ నాయకుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. జులై 21న ప్రారంభం కానున్న ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమ ర్యాలీలో  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు మరో 30 మంది నేతలు అవగాహన ర్యాలీలో పాల్గొంటారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడవ దశ ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. యాత్రలో దాదాపు 1000 నుంచి 2000 వేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది.

గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు నాయకులు బైక్‌ ర్యాలీలు నిర్వహించడంతో పాటు ఒక్కో నియోజకవర్గానికి ఓ కీలక నేత వెళ్లేలా ప్లాన్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని, టీఆర్‌ఎస్‌లో ఎందరో ఏకనాథ్ షిండేలు ఉన్నారని బండి మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏం జరుగుతుందో సీఎం కేసీఆర్‌కు ఎలా తెలుసు. బీజేపీకి ఎలాంటి వ్యూహం లేదని చెబుతున్న మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. బీజేపీకి వ్యూహం లేకపోతే 18 రాష్ట్రాల్లో ఎలా అధికారంలో ఉంటుంది. సీఎం మాట్లాడుతున్న భాష చాలా సిగ్గుచేటన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 Assembly Elections
  • Bandi Sanjay
  • bjp
  • Tarun Chugh

Related News

    Latest News

    • హార్దిక్ పాండ్యా ఔట్.. చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్రేయ‌సి, వీడియో వైర‌ల్‌!

    • తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధం : బోర్డు సెక్రటరీ కీలక సూచనలు ఇవే.. !

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు ఫైర్

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

      • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

      • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

      • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd