Teen Suicide: ఆ యాప్ వద్దని తండ్రి చెప్పడంతో 16 ఏళ్ళ కుమార్తె సూసైడ్
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 16 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్‌లో 'మెసేజింగ్ యాప్' డౌన్‌లోడ్ చేసుకోవడానికి తన తండ్రి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
- By Praveen Aluthuru Published Date - 01:10 PM, Mon - 24 June 24

Teen Suicide: ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. రోజు రోజుకి కొత్త యాప్ లు పుట్టుకొస్తున్నాయి. యువతను ఆకట్టుకునేందుకు డేటింగ్ యాప్ లు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా యాప్ ల బారీన పడి యువత పక్కదారి పడుతున్నారు. చదువును సైతం పక్కనపెట్టి కాలక్షేపానికి మొగ్గుచూపుతున్నారు. అయితే తల్లి దండ్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మహారాష్ట్రలో మెసేజింగ్ యాప్ వద్దని చెప్పడంతో 16 ఏళ్ళ యువతీ ఆత్మహత్యకు పాల్పడింది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 16 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్‌లో ‘మెసేజింగ్ యాప్’ డౌన్‌లోడ్ చేసుకోవడానికి తన తండ్రి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. డోంబివాలి ప్రాంతంలోని నీల్జేలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. యువతి తన మొబైల్ ఫోన్‌లో ‘స్నాప్‌చాట్’ యాప్ డౌన్‌లోడ్ చేసిందని, అలా చేయవద్దని తండ్రి చెప్పడంతో కోపంతో సదరు యువతీ ఈ దారుణానికి ఒడిగట్టిందని మాన్‌పాడ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
Also Read: Pakistan Cricket Board: ప్రక్షాళన మొదలుపెట్టిన పీసీబీ.. ఈ ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లు కట్..!