Paritala & Vangaveeti : టీడీపీ యువ నాయకులు భేటీ.. పరిటాల, వంగవీటి సమవేశంపై సర్వత్రా ఆసక్తి
ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ యువ నాయకులు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్‌లు....
- Author : Prasad
Date : 17-10-2022 - 6:08 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ యువ నాయకులు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్‌లు భేటీ అయ్యారు. రాజమండ్రిలోని ఓ రహస్య ప్రాంతంలో ఇరువురు భేటీ అయినట్లు సమాచారం. అయితే అమరావతి మహాపాదయాత్రలో ఇద్దరు యువనాయకులు పాల్గొనేందుకు రాజమండ్రికి చేరుకున్నారు. పరిటాల, వంగవీటి భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన రాజకీయ నేపథ్యమున్న వంగవీటి, పరిటాల కుటుంబాలకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తొలిసారిగా ఇరు కుటుంబాల వారసులు భేటీ అయినట్లు అనుచరులు చెప్తున్నారు. గతంలో వంగవీటి రాధాపై రెక్కీ ఘటనలో పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. రాధాను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.