TDP MLC Ashok Babu: పోలీసుల అదుపులో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు
తెదేపా ఎమ్మె ల్సీ అశోక్ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నా రు.
- By Hashtag U Published Date - 01:15 AM, Fri - 11 February 22

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నా రు. గురువారం రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ స్పందించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేసిందని విమర్శించింది. అశోక్ బాబు ఉద్యోగ సమయంలో విద్యా ర్హతను తప్పుగా చూపించారని పేర్కొంటూ సీఐడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇక పదోన్నతి విషయంలో విద్యా ర్హత తప్పుగా చూపించారని అశోక్ బాబు పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
Strongly condemn the illegal, midnight arrest of our party leader Ashok Babu Garu. This is clearly an act of vengeance against Ashok Babu Garu who stood for the rights of Govt employees. #WeStandWithAshokBabu pic.twitter.com/BrUQsicjwX
— Lokesh Nara (@naralokesh) February 10, 2022