AP : అప్పుడే టీడీపీ – జనసేన కలిసిపోయాయి..
యువగళం పాదయాత్ర లో కార్యకర్తలు లోకేష్ ప్లెక్సీ లలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ప్రచారం
- By Sudheer Published Date - 06:37 PM, Sat - 12 August 23

రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ (Janasena & TDP) కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది అధికారికంగా అటు చంద్రబాబు కానీ , ఇటు పవన్ కళ్యాణ్ కానీ చెప్పకపోయినా దాదాపు ఇదే అని అంత డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు ను పవన్ కళ్యాణ్ కలవడం..పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు వైసీపీ ఫై దాడి చేయడం..ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా యువగళం (yuvagalam) పాదయాత్ర లో కార్యకర్తలు లోకేష్ ప్లెక్సీ లలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ప్రచారం మొదలుపెట్టారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Naara Lokesh) దాదాపు 183 రోజులుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల నుండి కూడా లోకేష్ యాత్రకు విశేష స్పందన వస్తుంది. ప్రజల కష్టాలను . సమస్యలను తెలుసుకుంటూ , అధికార పార్టీ ఫై లోకేష్ విమర్శలు చేస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిదిలో యాత్ర జరుగుతోంది. పొడపాడు గ్రామంలో లోకేష్, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫోటోలతో ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇవి ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. స్థానికులతో పాటు పాదయాత్రకు వచ్చిన వారు సైతం ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా చూస్తున్నారు. పొత్తులపై ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ అప్పుడే ప్లెక్సీలు ఏర్పటు చేస్తున్నారని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ సైతం తన దూకుడు పెంచారు. అధికార పార్టీ ని చెమటలు పట్టిస్తున్నాడు. వరుసపెట్టి పర్యటన లు చేస్తూ వైసీపీ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు , బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ప్రతిపక్షాలు దాడులతో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది.
Read Also :