TDP – JSP : జనసేనతో సమన్వయం కోసం కమిటీని నియమించిన టీడీపీ
టీడీపీ జనసేన మధ్య సమన్వయం కోసం ఇరుపార్టీలు కమిటీలను నియమించాయి. ఇప్పటికే జనసేన టీడీపీతో సమన్వయం
- Author : Prasad
Date : 15-10-2023 - 8:32 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ జనసేన మధ్య సమన్వయం కోసం ఇరుపార్టీలు కమిటీలను నియమించాయి. ఇప్పటికే జనసేన టీడీపీతో సమన్వయం చేసుకునేందుకు కమిటీని నియమించగా.. టీడీపీ కూడా ఐదుగురు సభ్యులతో సమన్వయకమిటీని ఏర్పాటు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఈ కమిటీలోని సభ్యులుగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను నియమించారు. జనసేన – టీడీపీ పోత్తుల నేపథ్యంలో ఈ కమిటీని నియమించినట్లు టీడీపీ అధిష్టానం తెలిపింది. ఇరుపార్టీల మధ్య జరిగే చర్చలు, సీట్లపై చర్చలు ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
Also Read: Copied Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టిన కేసీఆర్