TDP : మాచర్లలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బర్త్‌డే వేడుకలకు..?
మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా
- By Prasad Published Date - 07:55 AM, Tue - 18 April 23

మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. జన్మదిన వేడుకల కోసం మాచర్లలో 10 ఏకరాలను సిద్ధం చేశారు. అయితే పోలీసులు మాత్రం జన్మదిన వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవరూ మాచర్ల రావొద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి పుట్టిన రోజు వేడుకలకు పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రస్థాయి నేతలంతా మాచర్ల వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. కారంపూడి నుంచి భారీ ర్యాలీతో జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్లకు వెళ్లనున్నారు.