Tax Relief: ఉద్యోగులకు పన్ను ఊరట.. బడ్జెట్లో భారీ ఊరట
ఎన్నో ఆశల మధ్య ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉద్యోలకు శుభవార్త వినిపించింది. 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్..
- Author : Anshu
Date : 01-02-2023 - 9:43 IST
Published By : Hashtagu Telugu Desk
Tax Relief: ఎన్నో ఆశల మధ్య ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉద్యోలకు శుభవార్త వినిపించింది. 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేలా పన్ను విషయంలో ఊరటనిచ్చారు. కోట్ల మంది ఆశలను నెరవేస్తూ నిర్మలా సీతారామన్.. ఉద్యోగుల ప్రయోజనాలకై రూ.7లక్షల వరకు రిబేట్ ను ప్రకటించారు. దీంతో తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగులకు భారీ ఊరట లభించినట్లైంది.
ఈ బడ్జెట్ లో పన్ను విధానంలో కేంద్రం పలు మార్పులు తెచ్చింది. పాత పన్ను విధానం జోలికిపోకుండా, కేంద్రం రిటర్న్ ల సమయంలో కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్ గా మార్చింది. అదే సమయంలో పన్నుల శ్లాబుల సంఖ్యను కుదించింది. పాత విధానంలో HRA, 80C, 80D, 80CCD రూ2.5లక్షల వరకు ఆదాయ మినహాయింపులు ఉండేవి. అలాగే రూ.5లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండేది కాదు. రూ.5లక్షలు దాటితే 20శాతం, 10లక్షలు దాటితే 30శాతం ఉండేది.
కానీ కొత్త విధానంలో పలు మార్పులను కేంద్రం తెచ్చింది. అందులో భాగంగా రూ.0-రూ.3లక్షల వరకు పన్ను సున్నా. అటు రూ.3లక్షల నుండి రూ.6లక్షల వరకు పన్ను 5శాతం,రూ.6లక్షల నుండి రూ.9లక్షల వరకు పన్ను 10శాతం, రూ.9లక్షల నుండి రూ.10లక్షల వరకు పన్ను 15శాతం, రూ.12లక్షల నుండి రూ.15లక్షల వరకు పన్ను 20శాతం, రూ.15లక్షల పై బడితే 30శాతం పన్ను కొత్త పన్ను చెల్లింపు విధానం కింద అమల్లోకి రానుంది.
గతంలో రూ.3లక్షల వరకు ఆదాయం పై పన్ను ఉండేది కాదు. ప్రస్తుతం రూ.5లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో రూ.7లక్షల వరకు ఆదాయంపై రూ.32800 పన్ను చెల్లించాల్సి ఉండేది. కానీ కొత్త పన్ను విధానం వల్ల ప్రామాణికంగా 50వేలు, 87A రివెట్ గా రూ.20800 ఆదా అవుతుంది.