Tamil nadu : దీపావళి క్రాకర్స్ పై ఆంక్షలు..!!
దీపావళి దేశప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ. చీకట్లను తొలగిస్తూ...జీవితంలో వెలుగులు నింపే ఈ వేడుక ఇల్లంతా దీపాలత అలంకరిస్తారు.
- By hashtagu Published Date - 06:39 AM, Tue - 11 October 22

దీపావళి దేశప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ. చీకట్లను తొలగిస్తూ…జీవితంలో వెలుగులు నింపే ఈ వేడుక ఇల్లంతా దీపాలత అలంకరిస్తారు. క్రాకర్స్,బానసంచా పేళ్లుళ్లతో సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ దీపావళికి కాల్చే క్రాకర్స్ వల్ల కాలుష్యం గణనీయంగా పెరుగుతుండటం, పక్షులు, ఇతర జీవ జాతులపై ప్రభావం చూపుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు విధించాయి. ఈ ఏడాది కూడా అవే ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించాయి.
తమిళనాడులో దీపావళి వేడుకలకు బాణాసంచా పేల్చడంలో ఎలాంటి మార్పులు లేవని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఉదయం 6 నుంచి 7 వరకు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని ప్రకటించింది. బాణాసంచా కాల్చడానికి సంబంధించి 2019 నుంచి పరిమితులు అమలులో ఉన్నాయి. 2018లో క్రాకర్స్ అమ్మకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ నిబంధనలు ఉండటంతో బాణాసంచా విక్రయించడానికి ఈ కామర్స్ వెబ్ సైట్స్ కు అనుమతి లేదు.
అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ క్రాకర్స్ కాల్చడం, విక్రయించడంపై నిషేధం యాథావిధంగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు సోమవారి తెలిపింది. ఢిల్లీలో బాణా సంచాపై నిషేధాన్ని ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.