CM’s Bumper Offer: తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్… నవజాత శిశువులకు.. బంగారు ఉంగరాలు, కమ్యూనిటీ లంచ్!
అఖండ మెజారిటీ గత ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వం విజయం సాధించింది. దిగ్విజంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఎంకే స్టాలిన్. పక్క రాష్ట్రాల సీఎంలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.
- Author : Anshu
Date : 26-02-2023 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
CM’s Bumper Offer: అఖండ మెజారిటీ గత ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వం విజయం సాధించింది. దిగ్విజంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఎంకే స్టాలిన్. పక్క రాష్ట్రాల సీఎంలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన 70వ జన్మదిన వేడుకలను మార్చి 1న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార డీఎంకే సన్నాహాలు చేస్తోంది.
నవజాత శిశువులకు బంగారు ఉంగరాల బహుమతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాలు ఏర్పా టు చేశారు. సమావేశాలతో పాటు క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా సీనియర్ రాజకీయ నాయకులు పాల్గొనే బహిరంగ సభ ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ బర్త్‌డే వేడుకల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గనే అవకాశం ఉంది.
పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది స్టాలిన్ పార్టీ. అందుకే ఈ సందర్భంలో తమ నాయకుడి పుట్టిన రోజుల వేడుకలను ఘనంగా చేయాలని, ప్రజలకు జీవితాంతం గుర్తుండాలని పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే తమిళనాడు వెలుపల కూడా పార్టీ కార్యకర్తలు పుట్టినరోజు జరుపుకోకున్నారు. ఇందులో పుదుచ్చే రి, కేరళ ఉన్నాయి. నటుడు, మక్క ల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మార్చి 1న స్టాలిన్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు.