Viral Video : సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో మద్యం పంపిణీ.. ట్రాక్టర్‌పై డ్రమ్ములో..?
తాడేపల్లిలో వినాయకుని ఊరేగింపు సందర్భంగా మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు
- Author : Prasad
Date : 06-09-2022 - 10:09 IST
Published By : Hashtagu Telugu Desk
తాడేపల్లిలో వినాయకుని ఊరేగింపు సందర్భంగా మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి కిలోమీటర్ దూరం లో ఉన్న తాడేపల్లి గేటు సెంటర్ వద్ద వినాయకుని ఊరేగింపు లో విచ్చలవిడిగా మద్యం పంపిణీ జరిగింది. బహిరంగంగా అందురు చుస్తుండంగా ట్రాక్టర్ మీద డ్రము ఏర్పాటు చేసి మద్యాన్ని వైసీపీ నేతలు పంపిణీ చేశారు. ఈ వినాయక ఉత్సవం కు ధర్మ కర్త తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి వ్యవహరిస్తున్నారు. పోలీసులు సమక్షంలో ఇలా బహిరంగంగా మద్యం పంపిణీ చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.