Blast in Afghanistan: మళ్ళీ బాంబులతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్
అఫ్ఘానిస్థాన్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది.
- By Hashtag U Published Date - 07:42 PM, Thu - 21 April 22
అఫ్ఘానిస్థాన్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబుల్‌తో సహా ఐదు చోట్లు పేలుళ్లు సంభవించాయి. ప్రార్థనా మందిరంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు జరిగాయి. ఈ బాంబు దాడుల్లో 18 మంది మరణించారు. మరో 65 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.మజార్-ఎ-షరీఫ్ మసీదుతో పాటు.. కాబూల్, నంగర్హర్, కుందుజ్‌లలో కూడా పేలుళ్లు జరిగాయి. కాబుల్ సహా ఒకేసారి పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరగడంతో ఆఫ్గనిస్తాన్ ఒక్కసారిగా వణికిపోయింది. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత కూడా అఫ్ఘానిస్థాన్ లో బాంబు పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 19న ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు సంభవించింది. మూడు ప్రదేశాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో 25 మంది స్కూల్ విద్యార్ధులు మృతి చెందారు. ఈ బాంబు పేలుళ్ల వేకన ఐసిస్ ఉగ్రముఠాల హస్తమున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఏ ఒక్క సంస్థ తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు. తాజాగా మరోసారి పేలుళ్ళు జరగడంతో ఆఫ్ఘనిస్థాన్ లో సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచీ లక్షలాది మంది దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు తాలిబన్లు ప్రయత్నించడం, ఎయిర్ పోర్టులు, రోడ్డు మార్గాలూ మూసివేయడం జరిగాయి. తర్వాత అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని అనుకుంటుండగా.. వరుస పేలుళ్ళు కలవరపెడుతున్నాయి.